మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే చిరంజీవి  ఈ సంవత్సరం ఆచార్య , గాడ్ ఫాదర్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం చిరంజీవి "వాల్తేరు వీరయ్య" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , బాబీమూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ లో మాస్ మహారాజ రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. రవితేజ పాత్ర ఈ మూవీ కే హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా , బాబీ సింహ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ఈ మూవీని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా వాల్తేరు వీరయ్య మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులను "పీ హెచ్ ఎఫ్" సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం. అలాగే ఈ సంస్థ ఈ మూవీ ని ఓవర్సీస్ లో అదిరిపోయే రేంజ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవిమూవీ లో వింటేజ్ లుక్ లో కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: