అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ ఎప్పటినుండో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రావాలని చూస్తోంది. స్టార్ హీరోల సరసన టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ఎంతగానో ఆశపడుతుంది .ఈమె  గతంలో ఎన్టీఆర్ 30వ సినిమాతో ఈమె ఇంటర్ ఇస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే .కానీ అవి ఏమాత్రం నిజం కాదు. అయితే తాజాగా ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోందని వార్తలు వస్తున్నాయి .మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు

 ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో రానున్న  సినిమాలో కీయార అధ్వాని  అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే .కాగా వీరి కాంబినేషన్ లో తిరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆఖరిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో ఓ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కాగా ఆర్సి 16 వర్కింగ్ టైటిల్తో రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారట.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ ను తీసుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వస్తున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు జాన్వీ కపూర్ అందుకుంటున్న రెమ్యూనరేషన్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమె ఆర్సీ 16 కి తీసుకుంటున్న పారితోషకం తెలిస్తే షాక్ అవుతారు .ఎందుకు అంటే ఆమె ఈ సినిమాకి ఏకంగా ఐదు కోట్లు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది .అంత అడగడంతో నిర్మాతలు షాక్కి గురయ్యారు .అయితే చివరగా జాన్వీ  నాలుగు కోట్ల రెమ్యూనరేషన్కు ఒప్పించారని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఏదేమైనా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మొదటి సినిమాకి ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్న జాన్వి కపూర్ పై తెగ వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ముందు ముందు ఇంకెంత తీసుకుంటుందో అంటూ నేటిజన్లో షాక్ అవుతున్నారు. ఇక దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.!!

మరింత సమాచారం తెలుసుకోండి: