పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరో సారి జోరు పెంచుతు న్నారు. ఇప్పటి కే `హరిహర వీరమల్లు` చిత్ర షూటిం గ్‌ లో పాల్గొం టున్న ఆయన ఇప్పుడు అభి మానులకు మరో సర్‌ ప్రైజ్‌ ఇవ్వ బోతున్నారు.
అనూహ్యం గా మరో కొత్త సినిమా ప్రకటిం చబోతున్నారు. ఇప్పటి కే పవన్‌ చేయా ల్సిన సిని మాలు నాలు గున్నాయి. ఇప్పుడు ఇంకో సినిమా ని ప్రకటించబో తుండటం ఆసక్తి ని రేకెత్తి స్తుంది. ఓ రకం గా పవన్‌ మరో సారి దూకుడు పెంచబోతు న్నారని చెప్పొచ్చు.

`సాహో` ఫేమ్‌ సుజిత్‌ తో పవన్‌ ఓ సినిమా చేయబో తున్నట్టు కొన్ని రోజులు గా వైరల్‌ అవు తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నే రేపు అధికారికం గా ప్రకటించబో తున్నారట. `ఆర్‌ఆర్‌ఆర్‌` వంటి భారీ సినిమా ని అందించిన డివివి ఎంటర్‌ టైన్‌మెంట్స్ ఈ సినిమా ని తెరకెక్కించ బోతుందని సమా చారం. అయితే ఈ నిర్మాణ సంస్థ తాజా గా సోషల్ద్వా మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటిం చింది. రేపు(ఆదివారం) బిగ్‌ అనౌన్స్ మెంట్‌ అని వెల్లడిం చింది. రేపు ఉదయం 8.55గంటలకు ప్రకటించబో తున్నట్టు సోషల్ మీడియా ద్వారా చెప్పారు‌.

అయితే ఇది పవన్‌-సుజిత్‌ల సినిమా నే అని తెలు స్తుంది. పవన్‌, సుజిత్‌ లతో డివివి దానయ్య సినిమా నిర్మించబో తున్నారని గతం లో వార్తలు వచ్చిన నేపథ్యం లో అదే ఇప్పుడు ప్రకటించనున్నారని అంటున్నారు. రేపు అధికారికం గా ఈ ప్రాజెక్ట్ ని ప్రకటి స్తారని, త్వరలో నే ప్రారంభం కూడా ఉంటుందని అంటున్నారు. షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్ అవు తుందనేది పక్కన పెడితే ఇప్పుడు పవన్‌ కొత్త సినిమా అనౌన్స్ మెంట్‌ అనే వార్త అభి మానులను ఊపే స్తుంది. వారిలో పూనకాలు లోడ్‌ చేస్తుందని అంటు న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: