పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూనే సినిమాల్లో కూడా చురుగ్గా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో నీది అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్ తాజాగా మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ తాజాగా యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో ఒక మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య నిర్మించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్ లో డి వి వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించబోయే సినిమాకు సోషల్ మీడియా వేదికగా రెబల్ స్టార్ ప్రభాస్ బెస్ట్ విషెస్ తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే రెబల్ స్టార్ ప్రభాస్ , సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సాహో మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ నార్త్ ప్రేక్షకులను అదిరిపోయే రీతిలో అలరించినప్పటికీ , సౌత్ ప్రేక్షకులను మాత్రం కాస్త నిరుత్సాహపరిచింది. సాహో సినిమా ద్వారా సుజిత్ కు నార్త్ ఇండియాలో మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: