పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వకీల్ సాబ్ మూవీ తో తిరిగి సినిమాల్లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తూ  వస్తున్నాడు. అందులో భాగంగా ఈ సంవత్సరం భీమ్లా నాయక్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తేరకక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా ఈ చిత్రం రూపొందుతోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్ తాజాగా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కబోయే ఒక మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఈ రోజు ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలవడింది. ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితమే టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ లో హీరో గా నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ డిసెంబర్ 22 వ తేదీన పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: