రష్మికా మందన్న గురించి అందరికి తెలుసు..ఆమెతో సినిమాలు చెయ్యాలని డైరెక్టర్ లతో సహా హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల అమ్మడు చేసిన సినిమాలు అన్నీ కూడా మంచి హిట్ టాక్ ను అందుకోవడమే..ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తుంది. కోలీవుడ్ తళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వారిసు. తెలుగులో వారసుడు పేరుతో తీసుకొస్తున్నారు. 


ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకుడు..ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. శిరీశ్, పీవీపీ కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు పోస్టర్లు, సాంగ్స్ విడుదల అయిన విషయం తెలిసిందే.తమిళంలో రంజితమే అనే సాంగ్ ను మూవీ యూనిట్ ఇటీవలే విడుదల చేసింది. ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. యూట్యూబ్ లో ఈ వీడియోకు మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. తాజాగా తెలుగులోనూ ఈ పాటను విడుదల చేశారు. తెలుగు వర్షన్ సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ అవడమే కాదు.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ పాట విడుదలయిందో లేదో.. దాంట్లో ఫన్నీ థింగ్స్ ను కూడా నెటిజన్లు చూసి రచ్చ చేస్తున్నారు. నిజానికి.. ఈ సాంగ్ లో బీట్ చేసిన సంగతి తెలిసిందే..డ్యాన్స్ చేస్తున్న సమయంలోనే రష్మిక కుడి కాలికి ఉన్న పట్టీ ఊడిపోయిందట. అయినా కూడా పట్టించుకోకుండా రష్మిక అలాగే డ్యాన్స్ చేస్తూ ఉందట. కనీసం మూవీ యూనిట్ అయినా చూసుకోవాలి కదా. కానీ.. మూవీ యూనిట్ కూడా చూసుకోకుండా సాంగ్ ను రిలీజ్ చేయడం ఏంటి.. కనీసం పట్టి ఉందా లేదా కూడా చూసుకోరా అంటూ ఎవరికీ వచ్చిన విధంగా వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఇది కాస్త వైరల్ అవుతుంది..ఇకపోతే రష్మిక వరుస సినిమాలతో పాటు వివాదాలను కూడా అందుకుంది..కన్నడ సినీ ఇండస్ట్రీ బ్యాన్ చెయ్యాలని చూస్తుంది..ఏమౌతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: