తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి ఇంకా దర్శకత్వం వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ బాల. అలాగే మరోవైపు తన నటనతో తమిళ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది అభిమానుల మనసు దొచుకున్నారు హీరో సూర్య.ఇక వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వనంగాన్ సినిమా రాబోతుంది. ఇటీవలే వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూవీని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి హీరో సూర్య అనుహ్యంగా తప్పుకున్నారు. దీంతో ఫిల్మ్ సర్కిల్లో ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని.. అందుకే హీరో సూర్యమూవీ నుంచి తప్పుకున్నారంటూ నెట్టింట ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు ఈ సినిమా డైరెక్టర్ బాల. సూర్యకు తనకు అసలు ఎలాంటి గొడవ జరగలేదని.. కేవలం సినిమా స్క్రిప్ట్ లో జరిగిన మార్పుల కారణం.. తను చెప్పడం వల్లే సూర్యసినిమా నుంచి తప్పుకున్నాడంటూ ట్విట్టర్ వేదికగా స్పెషల్ నోట్ షేర్ చేశారు డైరెక్టర్ బాల.


బాల తాజా ప్రకటనలో .. 'నా తమ్ముడు సూర్యతో వనంగాన్ సినిమా తెరకెక్కించాలని అనుకున్నాను.. కానీ స్టోరీలో కొన్ని మార్పులు చేసిన తర్వాత.. ఈ సినిమా అతనికి సరిపోదు అని భావించాను. సూర్యకు నాపై చాలా నమ్మకం ఉంది. కానీ .. అన్నయ్యగా అతనికి మంచి ఇవ్వడం నా బాధ్యత.ఇలాంటి చిత్రం తనకు ఇవ్వాలని లేదు. అందుకే అతడిని నేను ఈ సినిమా నుంచి తప్పుకోమని చెప్పాను.మేము ఇద్దరం పరస్పర అంగీకారంతో నే ఈ నిర్ణయం తీసుకున్నాము. నా నిర్ణయం పట్ల నా తమ్ముడికి గౌరవం ఉంది' అంటూ నోట్ షేర్ చేశారు.ఇక ఇదే మూవీను మరో హీరోతో తెరకెక్కించనున్నామని తెలిపారు. అయితే సూర్య స్థానంలో ఏ హీరో వస్తాడనేది మాత్రం తెలియలేదు. ఈ సినిమాని 2D ఎంటర్‌టైన్‌మెంట్‌పై సూర్య నిర్మించాల్సి ఉంది. ఇక ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వం లో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఒక ఫాంటసీ పీరియాడికల్ డ్రామా. ఇందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: