అద్భుతమైన టాలెంట్ ఉన్న మహిళా దర్శకురాలిలో ఒకరు అయినటు వంటి సుధా కొంగర గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుధా కొంగర సూర్య హీరోగా తెరకెక్కిన సూరారై పోట్రో మూవీ ద్వారా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ ని తెలుగు లో ఆకాశమే నీ హద్దురా పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో అలరించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ద్వారా దర్శకురాలు సుధా కొంగర కు హీరో సూర్య కు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

ఇది ఇలా ఉంటే సూరారై పొట్రు మూవీ ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న సుధా కొంగర ప్రముఖ పారిశ్రామిక వేత్త అయినటువంటి రతన్ టాటా  బయోపిక్ ను మూవీ గా తెరకెక్కించబోతుంది అంటూ ఒక వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ వార్తలపై తాజాగా మహిళా దర్శకురాలు సుధా కొంగర స్పందించింది ... నేను ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి రతన్ టాటా బయోపిక్ ను తెరకెక్కించబోతున్నాను అంటూ వస్తున్న వార్తలలో ఏ మాత్రం వాస్తవం లేదు అని , అవన్నీ కూడా రూమర్ లే అని సుధా కొంగర కొట్టివేసింది. రతన్ టాటా కు నేను వీరాభిమాని ని అని , ఆయన బయోపిక్ తెరకెక్కించలనే ఆలోచన ప్రస్తుతానికి నాకు లేదు అని సుధా కొంగర చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: