సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ రూపొందుతుంది. ఈ మూవీ లో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా కనిపించనుండగా , శ్రీ లీల రెండవ హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. మొదటి షెడ్యూల్ షూటింగ్ లో ఈ మూవీ యూనిట్ యాక్షన్స్  సన్నివేశాలను చిత్రీకరించింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఆల్బమ్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగ వంశీ ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ మ్యూజిక్ సెట్టింగ్స్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ,  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగ వంశీ దుబాయ్ కి వెళ్ళనున్నట్లు , దుబాయ్ లోని వేరు వేరు హోటల్ లలో ఈ మూవీ మ్యూజిక్ సెట్టింగ్స్ ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇలా మహేష్ 28 వ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ కోసం త్రివిక్రమ్ మరియు నాగ వంశీ అత్యంత శ్రద్ధను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ మూవీ కావడంతో ఈ మూవీ పై మహేష్ బాబు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: