పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక మూవీ సెట్స్ పై ఉండగానే మరో మూవీ ని సెట్ చేస్తూ ఫుల్ జోష్ లో సినీ కెరియర్ ముందుకు తీసుకు వెళుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సంవత్సరం భీమ్లా నాయక్ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ , ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా , మోస్ట్ గార్జియస్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి నిది అగర్వాల్ ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ తాజాగా తన తదుపరి మూవీ కి సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసిన విషయం మనకు తెలిసింది. రన్ రాజా రన్ , సాహో మూవీ లతో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరుచుకున్న సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తన తదుపరి మూవీ ని చేయబోతున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ మరియు సుజిత్ కాంబినేషన్ సూపర్. ఈ మూవీకి బెస్ట్ విషెస్ అంటూ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: