టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు ఈ మధ్య కాలంలో వరుసగా రెండు హిట్లను సాధించలేక కెరీర్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. సరైన కథలను ఎంచుకునే విషయంలో ఫెయిల్ అవుతుండటంతో టాలీవుడ్ హీరోలకు ఈ పరిస్థితి ఏర్పడింది.అయితే ముగ్గురు టాలీవుడ్ హీరోలు మాత్రం వరుసగా ఆరు విజయాలను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు. ఈ జనరేషన్ హీరోలలో ఈ అరుదైన రికార్డ్ ఈ ముగ్గురు హీరోలకే సొంతమైంది.

గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ కు తిరుగులేదనే సంగతి తెలిసిందే. తారక్ ఏ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినా ఆ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఈ జనరేషన్ లో డబుల్ హ్యాట్రిక్ సాధించిన స్టార్ హీరో తారక్ కావడం గమనార్హం. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్.ఆర్.ఆర్ ఘన విజయాలను సొంతం చేసుకోవడంతో తారక్ ఖాతాలో ఈ రికార్డ్ చేరింది.

అడివి శేష్ కూడా వరుసగా ఆరు విజయాలను సొంతం చేసుకున్నారు. అమీ తుమి, గూడాఛారి, ఎవరు, క్షణం, మేజర్, హిట్2 సినిమాలతో అడివి శేష్ ఖాతాలో సక్సెస్ చేరింది. వరుసగా ఆరు విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన హీరోలలో ఒకరిగా అడివి శేష్ నిలవడం హాట్ టాపిక్ అవుతోంది. భలే భలే మగాడివోయ్ సినిమా నుంచి నిన్ను కోరి సినిమా వరకు నాని డబుల్ హ్యాట్రిక్ సాధించారు.

ఈ ముగ్గురు హీరోలు డబుల్ హ్యాట్రిక్ సాధించడంతో ఈ ముగ్గురు హీరోల అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాబోయే రోజుల్లో మహేష్ బాబు కూడా డబుల్ హ్యాట్రిక్ సాధించే ఛాన్స్ అయితే ఉంది. వరుసగా నాలుగు సక్సెస్ లు మహేష్ బాబు ఖాతాలో చేరిన సంగతి తెలిసిందే. మిగతా రెండు సినిమాలతో మహేష్ ఏ రేంజ్ హిట్లు అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: