‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ మూవీలలో ఏసినిమా సంక్రాంతి విజేతగా మారుతుంది అన్న అంచనాలు ఇండస్ట్రీ వర్గాలకు కూడ అందడం లేదు. సంక్రాంతి రేస్ లో చిరంజీవి బాలయ్యల మధ్య పోటీ అంటే అది ఒక రేంజ్ లో ఉంటుంది. తెలుగు ప్రజలు పూర్తిగా కరోనా భయాల నుండి బయటకు వచ్చిన తరువాత మూడు సంవత్సరాలు తరువాత రాబోతున్న పండుగ కావడంతో ఈ సంక్రాంతి చాల హుషారుగా జరుగుతుందని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు జరగబోతున్న చిరంజీవి బాలయ్యల సంక్రాంతి రేస్ తో తిరిగి ధియేటర్లకు పూర్వపు కళ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశతో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ రెండు సినిమాలకు పోటీగా విజయ్ నటించిన ‘వారసుడు’ డబ్బింగ్ సినిమా విడుదల అవుతూ ఉండటం ఆసినిమాకు దిల్ రాజ్ నిర్మాత వంశీ పైడిపల్లి దర్శకుడు కావడంతో ఏదో ఒక ధైర్యం దిల్ రాజ్ కు ఉంది అన్న అంచనాలు వస్తున్నాయి.
సాధారణంగా డబ్బింగ్ సినిమాలు సంక్రాంతికి విడుదల కావు. అయితే దిల్ రాజ్ మూవీ కావడంతో ఎవరు అడ్డు చెప్పలేని పరిస్థితి. దీనికితోడు ఈసినిమాకు 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఒక డబ్బింగ్ సినిమా పై 50 కోట్ల బిజినెస్ జరిగింది అంటే అంత సులువు కాదు అంటున్నారు. గతంలో విజయ్ సినిమాలకు 20 కోట్ల మించి బిజినెస్ జరిగిన సందర్భాలు లేవు.అయితే ఇప్పుడు ‘వారసుడు’ బిజినెస్ విషయంలో కూడ చేస్తున్న సంచలనాలు చూసి చాలామంది షాక్ అవుతున్నారు. దీనికితోడు ఈమూవీ ప్రమోషన్ ను చిరంజీవి బాలకృష్ణ ల సినిమాలతో సమానంగా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో సంక్రాంతి రేసులో మితిమీరిన నమ్మకంతో ‘వారసుడు’ తీస్తున్న పరుగులు చూసి ఇండస్ట్రీ వర్గాలతో పాటు బాలకృష్ణ చిరంజీవి వీరాభిమానులు కూడ ఆశ్చర్యపోతున్నారు..
 


మరింత సమాచారం తెలుసుకోండి: