కరోన  కారణంగా సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఇలా అందరూ కరోనా కి బలైన  సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా చాలామంది మానసికంగా కృంగిపోయారు దీని కారణంగా చాలామంది వారి కుటుంబ సభ్యులను కోల్పోయారు, మరి కొంతమంది పిల్లలను కోల్పోయారు, తల్లిదండ్రులు అనాధలు ఇవ్వడం, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు అనాధలవడం ,ఇలా చాలా భయంకరమైన పరిస్థితులను చూసాం .ఇక ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు న్యూస్ ఛానల్ లో వార్తాపత్రికల్లో సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. 

అయితే నిత్యం మనం వీటిని చూస్తూ ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉండదు. ఏ సందర్భంలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా బిక్కిరి కావడం జరిగింది. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నటి చార్మి ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ వార్త వైరల్ గా మారింది .అదేంటంటే ప్రముఖ హీరోయిన్గా నిర్మాతగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న చార్మి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె అందంతో హీరోయిన్గా సినిమాలలో అవకాశాలు లేకపోవడంతో నటనను ఆపేసి డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థలో పనిచేస్తుంది.

అయితే ఈ క్రమంలోనే నటి చార్మి ఒక సంచల నిర్ణయాన్ని తీసుకుంది అంతేకాదు ఈమె అలాంటిది చూసి నా వల్ల కావడం లేదంటూ షాపింగ్ కామెంట్లు కూడా చేయడం జరిగింది ...అయితే సోషల్ మీడియాలో కరోన  విలయతాండవాన్ని ఈమె చూడలేకపోతున్నానని ప్రతిరోజు మంచి రోజులు రావాలని ఈ పరిస్థితి నుంచి అందరం బయటపడాలని అంతేకాదు దానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అందుకే ఇలాంటి ఘోరాలన్నీ చూడలేక నేను సోషల్ మీడియా నుండి నిష్క్రమిస్తున్నాను అని తెలిపిన సంగతి మన అందరికీ తెలిసిందే కదా .అయితే కరోనా వచ్చినప్పటినుండి ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇక అప్పటినుండి ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఆమె ఎలాంటి పోస్ట్లు కూడా చేయలేదు. అంతేకాదు ఆమె యాక్టివ్గా లేకపోవడంతో అభిమానులు మరింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దీంతో నటి చార్మి గతంలో తీసుకున్న ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: