మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గ్లామరస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి రీతు వర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. అలాగే తెలుగు మూవీ లతో పాటు ఈ ముద్దు గుమ్మ ఇతర భాష మూవీ లలో కూడా నటించి అక్కడి ప్రేక్షకులను కూడా బాగానే ఆలరించింది. కొన్ని రోజుల క్రితం రీతు వర్మ "వరుడు కావలెను" మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే రీతు వర్మ ఎక్కువ శాతం సినిమాలలో తన అందచందాలను ప్రదర్శించడానికి వీలు లేని పాత్రలలోనే నటిస్తూ తన కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. 

ఇలా సినిమాల్లో తన అందచందాలను ఆరబోయకుండానే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో కూడా రీతు వర్మ ఎక్కువ శాతం తన అందచందాలు ప్రదర్శితం కాకుండా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా రీతు వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఫోటో ను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో రీతు వర్మ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి మెడలో ఒక లాకెట్ ను పెట్టుకొని ఫోటోకు స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం రీతు వర్మ కు సంబంధించిన ఈ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: