మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం క్రాక్ మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసింది. అలా క్రాక్ మూవీ విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఆ తర్వాత ఖిలాడి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఆ తర్వాత రవితేజ "రామారావు అన్ డ్యూటీ" మూవీ తో రవితేజ ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ ఈ సంవత్సరం ధమాకా మూవీnతో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా ఉన్నాడు. 

శ్రీ లీల ఈ మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గ నటించగా త్రినాధ్ రావు నక్కిన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ మూవీ కి కార్తీక్ ఘట్టమనేని సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను మరియు పాటలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మరో సాంగ్ కు సంబంధించిన ప్రోమో ను విడుదల చేసింది. "దండకదియల్" అంటూ సాగే ఈ ప్రోమో సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ తెచ్చుకుంటుంది. ఈ ఫుల్ సాంగ్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: