చాలామంది అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే వార్ అయితే నడుస్తోంది. ఇక ఈ వార్ ఇప్పటిది అయితే కాదు.ఎన్టీఆర్(NTR), ఏఎన్నార్ ల కాలం నాటిది. ఇక ఆ తర్వాత కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు వీళ్ల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇక ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్,ఎన్టీఆర్,మహేష్ బాబు ఇలా చాలామంది హీరోల మధ్య పోటీ అనేది అయితే ఉంటుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా సంక్రాంతికి బాలకృష్ణ చిరంజీవి తమ సినిమాలతో పోటీ పడబోతున్నారు అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు కూడా వచ్చాయి.

అంతేకాదు ఇద్దరు హీరోలలో ఎవరు గొప్ప అనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ కూడా అవుతుంది. ఇక ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ గీతాకృష్ణ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. గీత కృష్ణ మాట్లాడుతూ.. అసలు చిరంజీవి కంటే బాలకృష్ణ గొప్ప అని ఎవడ్రా అన్నది. ఇప్పటికే చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా అయితే ఎదిగారు. కానీ బాలకృష్ణ మాత్రం తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో వచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో ఒకటో రెండో చిరంజీవి సినిమాలు ప్లాఫ్ అయినంత మాత్రాన అతని ఇమేజ్ ఏమీ కూడా తగ్గదు.

డైరెక్టర్ వల్ల రెండు సినిమాలు హిట్ అయితే బాలకృష్ణ చిరంజీవి కంటే ఎక్కువ అయిపోడు. అసలు చిరంజీవి రేంజ్ ని బాలకృష్ణ ఎప్పుడూ కూడా చేరుకోలేడు. ప్రస్తుతం బాలకృష్ణ టైం నడుస్తుంది కనుక ఆయన తీసిన సినిమాలన్నీ వరుస హిట్ అవుతున్నాయి. అలానే చిరంజీవి కి కూడా ఓ రోజు వస్తుంది. అప్పుడు ఆయన నటనతో మిగతా వాళ్ల నోర్లు అయితే ముయిస్తాడు. ఒకవేళ ఆయన సినిమాలు హిట్ కాకపోయినా ఏం పర్వాలేదు.ఎందుకంటే ఇప్పటికే తన రేంజ్ ఏంటో ప్రేక్షకులకు కూడా తెలుసు.

ఇప్పుడు నేను ఇవన్నీ బాలకృష్ణ అభిమానులను కించపరిచేలా అయితే మాట్లాడడం లేదు. సాధారణంగా చెబుతున్నాను అంటూ గీతాకృష్ణ బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక గీతకృష్ణ మాట్లాడిన మాటలు చూస్తుంటే బాలకృష్ణ ని టార్గెట్ చేసినట్లు గా కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతం గీత కృష్ణ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక డైరెక్టర్ గీతాకృష్ణ పై నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: