అనేకమంది అభిమానులతో పాటు ఎల్లప్పుడూ ప్రేక్షకులు కూడా కోరుకునే కాంబినేషన్లలో పవన్ కళ్యాణ్ మరియు రాజమౌళి కాంబినేషన్లో సినిమా చూడాలని కోరుకుంటూ ఉంటారు.పంజా సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా కలిసి చేయాలనుకున్నారని దీనికి పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పాడని రాజమౌళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు రావడం జరిగింది. అయితే రాజమౌళికి ఉన్న కమిట్మెంట్స్ మరియు పవన్ కళ్యాణ్ కి ఉన్న కమిట్మెంట్ కారణంగా వివిధ కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు అనంతరం పవన్ కళ్యాణ్ 

అటు రాజకీయాలు ఇటు సినిమాలు అంటూ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.వీరిద్దరి కాంబినేషన్లో  ఒక సినిమా అసాధ్యమని కొందరు భావిస్తున్నారు మరి కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ మరియు రాజమౌళి  కాంబినేషన్లో సినిమా ఖచ్చితంగా వస్తుంది అని నమ్ముతున్నారు. అయితే ఇప్పుడు వారి నమ్మకం నిజమవుతుందని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే 2024 తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి సినిమా చేయనున్నాడు. అంతే కాదు ఈ సినిమాకి సంబంధించిన

 స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారట. దీనికి సంబంధించిన షూటింగ్ చేయడానికి జూన్ నుండి ప్రారంభం కాదట. ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం ఉందట. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అని నాతో పాటు సురేందర్ రెడ్డితో సినిమా చేయనున్నాడు. ఈ మూడు సినిమాల అనంతరం పవన్ కళ్యాణ్ రాజమౌళితో కలిసి సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇదే నిజమైతే పవన్ ఫ్యాన్స్ కి హద్దులు లేకుండా పోతాయి ఈమధ్య పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమా కోసం ఆయన అభిమానులు ఇప్పుడు ఎంతగానో ఎదురుచూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: