మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాల పాటు రాజకీయాలపై దృష్టి పెట్టి సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి , వి వి వినాయక్ దర్శకత్వం లో తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 మూవీ తో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి "ఖైదీ నెంబర్ 150" మూవీతో తన స్టామినా ను బాక్స్ ఆఫీస్ దగ్గర నిరూపించుకున్నాడు. ఖైదీ నెంబర్ 150 మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఖైదీ నెంబర్ 150 మూవీ తర్వాత చిరంజీవి "సైరా నరసింహా రెడ్డి" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. సురేందర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించగా , నయనతార , తమన్నామూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ కూడా అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి చిరంజీవి స్టామినాను బాక్స్ ఆఫీస్ దగ్గర మరో సారి నిరూపించింది.

ఇలా రీ ఎంట్రీ లో భాగంగా రెండు విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న చిరంజీవి ఈ సంవత్సరం ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించగా , పూజా హెగ్డే , రామ్ చరణ్ కు జోడిగా నటించింది. భారీ అంచనా నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర  నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్ లు లభించలేదు. దానితో ఈ మూవీ కి 90 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత చిరంజీవి "గాడ్ ఫాదర్" మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: