మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గ్లామరస్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమలలో ఒకరు అయినటు వంటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే తెలుగు , తమిళ  , హిందీ భాషల మూవీ లలో నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే పూజా హెగ్డే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరో ల సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది.

అలాగే కొన్ని మూవీ లలో ఈ ముద్దు గుమ్మ ఐటమ్ సాంగ్ లో కూడా నటించి , తన హాట్ హాట్ అంద చందాలతో , డ్యాన్స్ తో కుర్ర కారు మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ కు ఈ సంవత్సరం మాత్రం అస్సలు కలిసి రాలేదు అని చెప్పవచ్చు. పూజా హెగ్డే ఈ సంవత్సరం అద్భుతమైన క్రేజ్ ఉన్నటు వంటి మూడు సినిమా లలో హీరోయిన్ గా నటించింది. ఆ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయాయి. పూజా హెగ్డే ఈ సంవత్సరం మొదటగా రాదే శ్యామ్  మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. భారీ అంచనాల నడుము విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత బీస్ట్ అనే తమిళ మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పాలయ్యింది. ఆ తర్వాత ఆచార్య మూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: