ఈ క్రమంలోనే అవార్డు వేదికపై ఇద్దరు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ సహా దర్శకుడు రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి లు కూడా సందడి చేశారు. అయితే ఈ అవార్డు ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ సూట్ బూట్ వేసుకొని ఫారిన్ లుక్ లో మెరిసాడు. అయితే చరణ్, రాజమౌళి కీరవాణి లు మాత్రం భారతీయ సాంప్రదాయాన్ని ప్రమోట్ చేసే విధంగానే ఇక సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇలా సాంప్రదాయ వస్త్రధారణలో అవార్డు ఫంక్షన్ కి హాజరైన రామ్ చరణ్ ఒక అరుదైన ఫీట్ సాధించాడు.
ఇప్పుడు వరకు ఏ ఇండియన్ సెలబ్రిటీ సాధించని రికార్డును కొల్లగొట్టాడు రామ్ చరణ్ అని చెప్పాలి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్ కి రామ్ చరణ్ వేసుకు వెళ్లిన డ్రెస్ ఇక ఈ ఘనతను తెచ్చిపెట్టింది అని చెప్పాలి. గోల్డెన్ గ్లోబ్స్ లో రెడ్ కార్పెట్ పై నడిచిన బెస్ట్ డ్రెస్ మెన్ టాప్ టెన్ సెలబ్రిటీల జాబితాలో ఇక రామ్ చరణ్ కూడా ఎంపిక కావడం గమనార్హం. అయితే ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరోకి కూడా ఈ లిస్టులో చోటు తగ్గలేదు అని చెప్పాలి. అయితే ఎన్టీఆర్ ఫారెన్ లుక్ లో అదరగొట్టిన ఇక సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించిన రామ్ చరణ్ వైపే గోల్డెన్ గ్లోబ్స్ మొగ్గు చూపింది అని చెప్పాలి.