తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటినటులలో హీరో శ్రీకాంత్ కూడా ఒకరు .ఎన్నో విభిన్నమైన పాత్రలలో విభిన్నమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. మొదట పలు సినిమాలలో విలన్ గా నటించి ఆ తర్వాత హీరోగా మారారు. అయితే హీరోగా దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు తన హవా కొనసాగించిన శ్రీకాంత్ ఈమధ్య పే డౌట్ కావడంతో తిరిగి మళ్ళీ విలన్ గా పలు సినిమాలలో నటించడానికి ప్రయత్నాలు చేస్తున్న ఏవీ పెద్దగా వర్కౌట్ కావడం లేదు. హీరో శ్రీకాంత్ వయసు ప్రస్తుతం 54 సంవత్సరాలు. అయినా కూడా పలు అవకాశాలను అందుకుంటూ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు శ్రీకాంత్.


యుద్ధం శరణం అనే సినిమాకు పూర్తిస్థాయిగా విలన్ గా మారారు. ఆ తర్వాత విలన్ గా పలు భాషలలో కూడా నటించి ప్రేక్షకాదరణ పొందారు. ఇక బాలయ్యతో అఖండ సినిమాలో నటించి పర్వాలేదు అనిపించుకున్న.. ఈ సినిమాతో శ్రీకాంత్ కు క్రెడిట్ రాలేదు కేవలం మరొక విలన్ కి పేరు వచ్చింది. ఆ తరువాత మరే సినిమాలకు కూడా నటించలేదు. ఒక రకంగా సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు మాత్రమే క్లిక్ అయ్యారని చెప్పవచ్చు. ఆయనను చూసి అలాంటి ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న శ్రీకాంత్ నిలతకుకోవడం అంటే చాలా కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హంట్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్.

సినిమా ద్వారా అయినా హిట్ అందుకుంటే మరికొన్ని అవకాశాలు వెలువడే అవకాశం ఉందని చెప్పవచ్చు. హీరో శ్రీకాంత్ కుమారుడు హీరోగా నిలదొక్కుకునే విధంగా పలు ప్రయత్నాలు చేస్తున్నారు మొదట పెళ్లి సందడి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు ఆ తర్వాత కుమారుడు కూడా సరైన సినిమా అవకాశాలు రాలేదు శ్రీకాంత్ ఎప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో వర్కౌట్ అవుతారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: