మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సాధారణ  నటుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి  ప్రస్తుతం మెగాస్టార్ గా తన హవాను కొనసాగిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అనేక సినిమాల్లో నటించిన ఈయన స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే తాజాగా  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 

సినిమా విడుదలై ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ ఈ సినిమాని చూసేందుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాల్లో మాస్ మహారాజా రవితేజ మరో కీలక పాత్రలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమాను చూసేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు మెగా మరియు మాస్ మహారాజా అభిమానులు.ఇక మాస్ మహారాజ రవితేజసినిమా విజయానికి ప్రధాన కారణం అని ఎప్పటికీ మెగాస్టార్ చిరంజీవి పలు సందర్భాలలో చెప్పడం మనం చూసాం. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా 100 కోట్ల షేర్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా దూసుకుపోతోంది.

ఇక్కడే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్స్ ఓవర్సీస్ లో కూడా మంచి జోరును కనబరుస్తున్నాయి. అయితే తాజాగా యూఎస్ఏ కలెక్షన్స్పై సంచలను కామెంట్లను చేశారు మెగాస్టార్ చిరంజీవి. అయితే తాజాగా నిన్న యూఎస్ఏ లో 25 నగరాలలో ఒకేసారి ఒకే సమయంలో 25 ప్యాన్ షో లో వేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా యుఎస్ఏ ఫ్యాన్స్ తో జూమ్ కాల్ లో మాట్లాడాడు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ ఎక్కడైతే వాల్తేరు వీరయ్య 2.25 రేటింగ్  తెచ్చుకుందో అక్కడ 2.25 మిలియన్ డాలర్ల రెవెన్యూ క్రియేట్ చేసింది అంటూ వాల్తేరు వీరయ్య సినిమా గురించి ఆసక్తికరమైన కామెంట్లను చేశారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: