బాలయ్య మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం అని ఫ్యాన్స్ భావిస్తారనే విషయం తెలిసిందే. 62 సంవత్సరాల వయస్సులో కూడా బాలయ్య సినిమాలలో మరియు రాజకీయాలలో సత్తా చాటుతూ ప్రేక్షకాదరణను మరియు ప్రజాదరణను సొంతం చేసుకుంటున్నారు.

అన్ స్టాపబుల్ సీజన్1 అలాగే అన్ స్టాపబుల్ సీజన్2 బాలయ్యను తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయనే విషయం తెలిసిందే. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బాలయ్యకు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు కూడా దక్కాయి.

బాలయ్యకు వివాదాలు అయితే కొత్తేం కాదు. గతంలో మెగా ఫ్యామిలీపై బాలయ్య విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని బాలయ్య చేసిన కామెంట్లు కూడా సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యాయి. ఒక ఈవెంట్ లో అమ్మాయికి ముద్దైనా పెట్టాలి అంటూ బాలయ్య చేసిన కామెంట్లపై మహిళా సంఘాల నుంచి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయనే విషయం తెలిసిందే.

బాలయ్య అనవసర వివాదాల్లో చిక్కుకోవడం ఫ్యాన్స్ కు కూడా అస్సలు నచ్చడం లేదు. బాలయ్య చేసిన కామెంట్లను ఏ విధంగా సమర్థించాలో అభిమానులకు కూడా అస్సలు అర్థం కావడం లేదు. అక్కినేని తొక్కినేని అని బాలయ్య చేసిన కామెంట్ల వల్ల అక్కినేని ఫ్యామిలీతో తనకు గ్యాప్ ఉందని బాలయ్య చెప్పేశారని తెలుస్తుంది.. అక్కినేని హీరోలు ఈ షోకు హాజరు కాకపోవడం వెనుక ఈ గొడవలే కారణమని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

అయితే బాలయ్య మారాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది. ఎమ్మెల్యే  అయిన కూడా బాలయ్య ఎన్నికల సమయంలో అనవసర వివాదాలను ఎందుకు సృష్టించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇతరులను కించపరుస్తూ బాలయ్య కామెంట్లు చేయడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదని ఫ్యాన్స్ సైతం చెబుతున్నారటా.. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: