జబర్దస్త్ షో ద్వారా టాప్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది అనసూయ. అలా కొంతకాలం జబర్దస్త్ లో యాంకరింగ్ కొనసాగిస్తూనే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.  ముఖ్యంగా డీ గ్లామరస్ రోల్స్ తో అదరగొట్టేస్తోంది. 'రంగస్థలం' నుంచి మొదలుకొని 'పుష్ప', 'విమానం', 'పెదకాపు' వంటి సినిమాల్లో డీ గ్లామరస్ గా కనిపించి ఆకట్టుకుంది. అయితే తాజాగా అనసూయ కీలక పాత్రలో నటించిన 'ప్రేమ విమానం' అనే వెబ్ ఫిలిం అక్టోబర్ 13న 'జీ 5' ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో అనసూయ పాల్గొంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించగా ఇందులో డీ గ్లామరస్ పాత్రలు చేయడం గురించి అనసూయ అసలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 ప్రెస్ మీట్ లో భాగంగా ఓ విలేఖరి అనసూయను, 'లాక్ డౌన్ తర్వాత యాక్టర్ గా మీ గ్రేట్ జర్నీ కనిపిస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇదంతా ప్లానింగ్ ప్రకారం జరుగుతుందా? లేకపోతే అలా వచ్చేస్తున్నాయా?' అని అడగగా అందుకు అనసూయ బదులిస్తూ.." నా ప్లాన్ ఒక్కటే అదేంటంటే, ఆడియన్స్ ని బోర్ కొట్టించకూడదు. నేను చిన్నప్పటినుంచి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో విన్నర్ ని. గెటప్స్ వేయడం, రెడీ అవ్వడం అనేది దానంతట అదే నాలో ఉంది. అదే సమయంలో నేను ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాల్సింది నాకు ఫస్ట్ మూవీ 'క్షణం' ఆఫర్ ఇచ్చిన అడవి శేష్, మా డైరెక్టర్ రవికాంత్ కి అలాగే సుకుమార్ గారికి. నా కెరీర్లో ఆయన నాకు చాలా పెద్ద బ్రేక్ ఇచ్చారు. 

అంతేకాదు యాక్టర్ గా నన్ను నేను రీ డిస్కవర్ చేసుకోగలిగాను. ఏ పాత్ర అయినా నేను చాలా ఇష్టంగా చేస్తాను. నేను మీలో ఆడియన్స్ లాగా కూర్చున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నాకు సినిమాలో ఏం జరుగుతుందో తెలుసు. కానీ దాన్ని నేను స్క్రీన్ పై చూసుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈ 'ప్రేమ విమానం' సినిమా చూసిన తర్వాత కూడా నేను ఏడ్చాను. 'గ్లామర్ మీకున్న బలం. కానీ ఈ మధ్య అన్ని డీగ్లామర్ రోల్స్ చేయడానికి కారణమేంటని?' అడగగా.." గ్లామర్ నా బలం అని నాకు తెలియదు. కొంతమంది నా గ్లామర్ ని ఇష్టపడతారు. కొంతమంది తిడతారు. నా బలం ఏంటంటే, నా లైఫ్ లో నేను ఆనందంగా ఉండాలి. దానికి నేను ఏం చేయాలో అది చేస్తాను. అది సినిమాలోనైనా, నిజ జీవితంలోనైనా నాకు నచ్చినట్టు నేను ఉండటమైనా" అంటూ చెప్పుకొచ్చింది అనసూయ. 


మరింత సమాచారం తెలుసుకోండి: