ఇటీవల ఖుషి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది సమంత. ఖుషి సినిమా కంటే ముందు తన వ్యక్తిగత కారణాలవల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న సమంత 2021లో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా అనారోగ్య బారిన పడింది. ఈ నేపథ్యంలోనే ఆమె నటించిన పలు సినిమాలు ఫ్లాప్ కూడా అయ్యాయి. అదే సమయంలో ఖుషి సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్న సమంతకి మళ్ళీ ఖుషి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ్లో సైతం చాలామంది స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ  స్టార్ హీరోయిన్గా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. 

అంతేకాదు చాలావరకు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి మెప్పించిన సమంత ఆ సినిమాలతో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక గత కొంతకాలంగా మయూసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. కానీ ఇప్పటికీ ఆ వ్యాధి నుండి పూర్తిగా కోలుకోలేదు. అంతేకాదు ఖుషి సినిమా తర్వాత దాదాపుగా మూడు నెలలపాటు విదేశాలకు వెళ్ళింది. అక్కడే ట్రీట్మెంట్ సైతం తీసుకున్న సమంత మళ్ళీ తాజాగా హైదరాబాద్ కి చేరుకుంది. మళ్లీ ఇప్పుడు కమిట్ అయిన సినిమాల షూటింగ్లో బిజీగా ఉంది.

 “చెన్నై స్టోరీస్” అనే ఆంగ్ల చిత్రంలో ఆమె నటిస్తున్నారు. కాగా తాజాగా బాలీవుడ్ నుండి సమంతకి బిగ్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే కోలీవుడ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా “ది బుల్” అనే సినిమా చేయనున్నారు..  ఈ ప్రాజెక్టులో సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా మొదట త్రిష పేరు వినబడింది. అయితే ఇప్పుడు సమంతని తీసుకోవడానికి సినిమా యూనిట్ రెడీ కావడం జరిగిందంట. “ఊ అంటావా మావా ఊఊ అంటావా” అనే ఐటెమ్ సాంగ్ తో సమంత నటనకి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా కావడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: