టాలీవుడ్ స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఇండస్ట్రీలో సైలెంట్ ఎంట్రీ ఇచ్చి ఒకసారిగా దూసుకుపోతుంది. నిన్న మొన్నటి వరకు ప్రేక్షకులకు ఈమె పేరు కూడా సరిగ్గా తెలియదు.ఈమెకు ఎటువంటి క్రేజ్ లేదు. అయితే ఒక్కసారిగా మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాతో ఈమె పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది. ఈ సినిమాతో ఈమె క్రేజ్ వేరే లెవెల్ కి వెళ్ళింది. మహేష్ లాంటి స్టార్ హీరో పక్కన అవకాశం దక్కడం తో ఈమె జాక్‌పాట్‌ కొట్టిందని చెప్పాలి. మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్గా మెప్పించిన మీనాక్షి చౌదరి.. కనిపించింది చిన్న క్యారెక్టర్ లోనే ఆయినా.. తన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. అంతెదుకు సినిమాలో పాటలో కూడా మీనాక్షి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.చూస్తుంటే మీనాక్షి చౌదరి సౌత్ లో స్టార్ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకునేలా ఉంది. ఓ పక్కన తమిళ్ స్టార్ హీరో విజయ్‌తో గోట్‌ సినిమాలో నటిస్తూనే.. నెక్స్ట్‌ వరుణ్ తేజ్ మట్కా, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక విశ్వక్సేన్ తోను ఓ సినిమాకు ఓకే చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ నేపథ్యంలో మరో భారీ ప్రాజెక్టుకు మీనాక్షి సైన్ చేసిందంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా సెలెక్ట్ అయిందని.. ప్రస్తుతం ఇతర నటీనటులు టెక్నికల్ స్టాప్ కోసం సెలక్షన్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఎఫ్2 సినిమా లానే అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా కూడా ఆకట్టుకోనుందట. వెంకీ కథలో మరో హిట్ పక్కా అంటూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎంతో నమ్మకంగా చెప్తున్నారు.
మూవీ స్క్రిప్ట్‌ని అనిల్ రావిపూడి ఇప్పటికే ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఈ సినిమా టైటిల్ ని కూడా రిజిస్టర్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల సంక్రాంతి బరిలో సైంధవ్‌ సినిమాతో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తరువాత ఎఫ్2, ఎఫ్3 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ల అందించిన అనీల్ రావిపూడి తో సినిమాకు కమిట్ అయ్యాడు వెంకీ. తన కెరీర్ లో 76వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుందని టాక్. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా డీటెయిల్స్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఏదేమైనా అద్భుతమైన అభినయంతో ఆకట్టుకునే అందంతో ఓవైపు యంగ్ హీరోస్ పక్కన అవకాశాలు అందుకుంటూనే.. మరో పక్క సీనియర్ హీరోలతో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతోంది మీనాక్షి.

మరింత సమాచారం తెలుసుకోండి: