హ్యాపీ డేస్', 'కొత్త బంగారులోకం'.. ఇప్పటికీ యూత్‌కు గుర్తుండిపోయే సినిమాల లిస్ట్‌లో తప్పకుండా ఉంటాయి. అలాంటి బ్యాక్ టు బ్యాక్ యూత్‌ఫుల్ స్టోరీలతో కెరీర్ మొదట్లోనే సూపర్ హిట్స్ అందుకున్నాడు వరుణ్ సందేశ్.కానీ ఆ తర్వాత తన కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదు. మళ్లీ ఇంతకాలం తర్వాత తను సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి వరుస మూవీస్‌తో బిజీ అవుతున్నాడు. తాజాగా తను పాల్గొన్న ఇంటర్వ్యూలో ఒకప్పుడు తన భార్య వితికా స్లీపింగ్ పిల్స్ వేసుకుందంటూ వచ్చిన రూమర్స్‌పై స్పందించాడు. అంతే కాకుండా తన పర్సనల్ లైఫ్‌పై వచ్చిన మరిన్ని రూమర్స్‌పై వరుణ్ కామెంట్ చేశాడు.వరుణ్ సందేశ్, వితికా షేరు హీరోహీరోయిన్లుగా కలిసి ఒక సినిమా చేశారు. అదే సమయంలో వారిద్దరూ ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ ఆన్ స్క్రీన్ గానీ, ఆఫ్ స్క్రీన్ గానీ పెద్దగా కనిపించలేదు. ఇంతలోనే పెళ్లయిన ఏడాదిలోనే వితికా షేరు స్లీపింగ్ పిల్స్ వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని రూమర్స్ బయటికొచ్చాయి. దానిపై వరుణ్ సందేశ్ తాజాగా స్పందించాడు. ‘‘వితికాకు అప్పుడు ఒంట్లో బాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. తనకు అప్పుడు నిద్రపోవడానికి ప్రాబ్లమ్ ఉండేది. అప్పుడే డాక్టర్ ఇచ్చిన మందుల కంటే కాస్త ఎక్కువగా స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం వల్ల తను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది’’ అని చెప్పుకొచ్చాడు వరుణ్ సందేశ్.‘‘ఎక్కువ స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం వల్ల తను హాస్పిటల్లో అయినప్పుడు నేను ఇక్కడ లేను, అమెరికాలో ఉన్నాను. అది తెలిసినప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చేశాను. కానీ అప్పటికి తను బాగానే ఉంది. తను కూడా ఈ విషయంపై బయటికొచ్చి క్లారిటీ ఇచ్చింది.

 కానీ క్లారిటీ ఇచ్చేలోపే అంతా వైరల్ అయిపోయింది’’ అని క్లారిటీ ఇచ్చాడు వరుణ్ సందేశ్. ఇక తమపై వచ్చే రూమర్స్‌ను ఎలా తీసుకుంటారో చెప్తూ.. ‘‘నేను అలాంటివి పెద్దగా పట్టించుకోను. అలాంటివి పట్టించుకుంటే రోజూ ఏదో ఒక చూసి బాధపడి డిప్రెషన్లోకి వెళ్లాల్సొస్తుంది’’ అని అన్నాడు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే తనపై చాలా డేటింగ్ రూమర్స్ వచ్చాయని, ఎప్పుడూ ఏదో ఒక హీరోయిన్‌తో డేటింగ్ అని రూమర్ వచ్చేదని తెలిపాడు వరుణ్.వితికాతో పెళ్లికి ముందు తను 2,3 రిలేషన్షిప్స్లో ఉన్నానని బయటపెట్టాడు వరుణ్ సందేశ్. పెళ్లి తర్వాత తను పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్‌గా మారిపోయానని అన్నాడు. ఇక తన భార్య వితికా గురించి చెప్తూ.. ‘‘వితికా నా లైఫ్‌లైన్. తను ఒక వెబ్ సిరీస్ సైన్ చేసింది. త్వరలోనే స్టార్ట్ అవుతుంది. తను కంటెంట్ చేయడం అనేదే చాలా గ్రేట్. అందరూ తనను ప్రశంసిస్తుంటారు కానీ దాని వెనుక కష్టం నేను చూస్తున్నాను. దానికి చాలా ఓపిక, ప్లానింగ్, డెడికేషన్ అన్నీ ఉండాలి. పెళ్లి వల్ల ఇద్దరి జీవితాల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. పిల్లల గురించి అడగగా.. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామని, త్వరలో దీని గురించి ఆలోచిస్తామని బయటపెట్టాడు వరుణ్ సందేశ్.

మరింత సమాచారం తెలుసుకోండి: