షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌ల నుంచి చాలామంది నటీనటులు వెండితెరపై వెలగడానికి అవకాశాలు దక్కించుకుంటారు. అలాంటి వారిలో నేహా పఠాన్ కూడా ఒకరు.షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా నటించిన ‘స్టూడెంట్’ అనే వెబ్ సిరీస్‌లో హీరోయిన్గా నటించి యూత్‌కు బాగా దగ్గరయ్యింది నేహా. తను లీడ్ రోల్ చేసిన సినిమాలకంటే ఈ సిరీసే తన కెరీర్‌కు పెద్ద ప్లస్ అయ్యింది. అందుకే కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ‘సత్యభామ’లో కూడా నేహాకు ఒక కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది. ఇక ‘స్టూడెంట్’ గురించి, షణ్ముఖ్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది నేహా పఠాన్.‘‘స్టూడెంట్ వెబ్ సిరీస్ అనేది నా కెరీర్‌కు చాలా హెల్ప్ చేసింది. షణ్ముఖ్ అంటే అందరికీ తెలుసు. అందుకే షూట్ చేస్తున్నప్పుడు అందరు వచ్చి చూడడం కొంచెం కష్టంగా అనిపించింది. కానీ తను చాలా డెడికేషన్‌తో ఉంటాడు, హార్డ్ వర్క్ చేస్తాడు. పర్సనల్‌గా కూడా తను చాలా మంచి వ్యక్తి. ఒక ఫ్రెండ్‌గా చాలా హెల్ప్ చేశాడు. ఎందుకంటే నాకు తెలుగు రాదు కదా. ఎలా పెర్ఫార్మ్ చేయాలో చెప్తుండేవాడు. వెబ్ సిరీస్‌లో చాలా పెద్ద సీన్స్ ఉన్నాయి. తనకు ఉన్న వేరే ప్రాబ్లమ్స్ గురించి నేను కామెంట్ చేయను’’ అని షణ్ముఖ్ గురించి చెప్పుకొచ్చింది నేహా పఠాన్. ఇక వెబ్ సిరీస్, సినిమాల్లో తేడా గురించి కూడా తను మాట్లాడింది.‘‘వెబ్ సిరీస్, సినిమాల్లో చాలా తేడా ఉంటుంది. సిరీస్‌ను చాలా తొందరగా షూట్ చేస్తారు. ఎందుకంటే స్క్రిప్ట్ పెద్దగా ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ కనీసం 40 నిమిషాలు ఉంటుంది.

సినిమాలకు టైమ్ తీసుకొని నచ్చినట్టుగా షూటింగ్ చేస్తారు. రీటేక్స్ అయినా, టైమ్ పట్టిన పర్వాలేదు సినిమా బాగుండాలి అనుకుంటారు’’ అంటూ తేడాను తెలిపింది నేహా పఠాన్. ఇక తను ముంబాయ్‌లో పుట్టి, పెరిగిన అమ్మాయి అని, 12 ఏళ్ల నుండే యాక్టింగ్ ప్రారంభించానని బయటపెట్టింది. ముందుగా మరాఠీలో కూడా ఒక వెబ్ సిరీస్ చేశానని తెలిపింది. తెలుగు తనకు రాదు కాబట్టి నేర్చుకోవడానికి కష్టపడుతున్నానని చెప్పుకొచ్చింది నేహా.‘సత్యభామ’లో కాజల్ అగర్వాల్‌తో కలిసి పనిచేసిన ఎక్స్‌పీరియన్స్‌ను కూడా ప్రేక్షకులతో షేర్ చేసుకుంది నేహా పఠాన్. ‘‘ఆమె పెద్ద స్టార్ అనే ఆరా తన చుట్టూ ఉంటుంది. మొదట్లో ఆమెతో కలిసి నటించాలంటే నేను కొంచెం భయపడ్డాను. తను పెద్ద స్టార్, మొదటిసారి నా పక్కన కూర్చున్నారు అనుకునేదాన్ని. తర్వాత నేను చాలా సౌకర్యంగా ఫీల్ అయ్యేలా చేసింది. చాలా హెల్ప్ చేసింది. తను ముందుకు వచ్చి నిలబడితే నేనేం మాట్లాడలేను. ఆమెపై అభిమానం ఉంది, అలాగే పెద్ద స్టార్ అని భయం కూడా ఉంది’’ అని చెప్పింది. తనకు ఎప్పుడూ ఒక గర్ల్‌ఫ్రెండ్ రోల్లోనే కనిపించడం కాకుండా ఛాలెంజింగ్ రోల్స్ చేయాలి అనేది తన కల అని బయటపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: