ఈ మధ్య కాలంలో భాగ్యశ్రీ బోర్సే పేరు గట్టిగానే వినిపిస్తుంది. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ చిత్రంలో ఈ బ్యూటీయే హీరోయిన్. అయితే తాజాగా భాగ్యశ్రీ మరో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు టాక్.హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'మిస్టర్ బచ్చన్' సినిమాతో భాగ్యశ్రీ బోర్సే తెలుగు తెరకు పరిచయం అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆమెకు వరుస ఆఫర్లు దక్కుతున్నాయి. తాజాగా భాగ్యశ్రీ మరో తెలుగు చిత్రానికి సైన్ చేసినట్లు సమాచారం.డెబ్యూ డైరెక్టర్ రవి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్సినిమా చేయబోతున్నారు. ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అమెరికా బ్యాక్ గ్రౌండ్‌లో సాగే ఈ లవ్ స్టోరీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభం కానుంది. ఇది కూడా పాన్-ఇండియా సినిమాగానే విడుదలయ్యే అవకాశం ఉంది.ఇక ఈ చిత్రం కాకుండా భాగ్యశ్రీకి మరో ఆఫర్ కూడా దక్కినట్లు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలో భాగ్యశ్రీని తీసుకోబోతున్నట్లుగా టాక్ ఉంది. అలానే సుజీత్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ఇటీవల ఓ సినిమా ప్రకటించారు. ఈ చిత్రంలో కూడా భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్‌గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయట. అన్నీ కుదిరితే నాని-సుజీత్ సినిమా ఛాన్స్ కూడా ఈ బ్యూటీ దక్కించుకునే అవకాశం ఉంది.

ఇలా డెబ్యూ సినిమా రిలీజ్ కాకుండానే టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ.భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం 'యారియాన్ 2'తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చింది. ఇక యారియాన్ 2లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయి డైరెక్టర్ హరీశ్ శంకర్.. మిస్టర్ బచ్చన్‌లో ఛాన్స్ ఇచ్చారు. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇచ్చే విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ఉంటుంది.మరోవైపు దుల్కర్ సల్మాన్ కెరీర్ విషయానికొస్తే దర్శకుడు వెంకీ అట్లూరితో 'లక్కీ భాస్కర్' అనే సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో దుల్కర్ క్యాషియర్‌గా నటిస్తున్నారు. ఇందులో దుల్కర్‌కి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: