జూ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో రాబోతున్న దేవర పార్ట్ 1 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఓసారి ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రిలీజ్ డేట్‌ను మార్చాలని మూవీ టీమ్ భావిస్తుందట.జూ ఎన్టీఆర్ ప్రస్తుతం గోవాలో తన యాక్షన్ డ్రామా 'దేవర' షూటింగ్‌లో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా టాక్ ఉంది. ఇక దేవర రెండు భాగాలుగా రూపొందుతోంది. దేవర: పార్ట్ 1ను ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ముందుగా ప్రకటించినా షూటింగ్ ఆలస్యం కావడంతో దసరాకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ఎప్పుడో ప్రకటించింది. అయితే తాజాగా ఈ రిలీజ్ డేట్‌ను కూడా మార్చాలని భావిస్తున్నారట.గత కొన్ని రోజులుగా దేవర సెప్టెంబర్ 27కి ప్రీపోన్ అవుతుందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి సెప్టెంబర్ 27న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఆ డేట్‌కి దేవరను దింపాలని మూవీ టీమ్ అనుకుంటుంది. దీనిపై దాదాపు ఫిక్స్ అయినట్లు టాక్. త్వరలోనే రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ఇక 'దేవర' స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. 2025లో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పార్ట్ 2 గురించి అయితే ఇప్పటివరకూ పెద్దగా చర్చ లేదు.

దేవర పార్ట్ 1 రిలీజ్‌పైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ పాత్రను పోషిస్తుండటం విశేషం.2022లో ఆర్ఆర్ఆర్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత చేస్తున్న చిత్రం ఇదే. అంటే దాదాపు రెండేళ్ల తర్వాత ఎన్టీఆర్ మళ్లీ ఆడియన్స్‌ను పలకరిస్తున్నారు. ఇక దీంతో పాటు ఏక కాలంలో వార్ 2 షూటింగ్ కూడా జరుగుతోంది. తన తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రంపై ఎన్టీఆర్ గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు. ఇందులో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే రెండూ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరోవైపు ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ ప్రాజెక్టు ఈ సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: