రేణు దేశాయ్.. పరిచయం అవసరం లేని పేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడిగా బద్రి చిత్రంలో నటించిన బ్యూటీ. ఇక అనంతరం జానీ మూవీలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అనంతరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యి అకిరా నందన్ మరియు ఆధ్యా అనే ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చారు.

కానీ కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక పవన్ కి విడాకులు ఇచ్చిన అనంతరం తన పని తాను చూసుకుంటూ తన లైఫ్ని లీడ్ చేస్తుంది. అయినప్పటికీ ఏదో రీజన్ చేత ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఒక్కొక్కసారి అయితే రేణు దేశాయ్ వీటిపై సీరియస్ గానే స్పందిస్తుంది. పవన్ గురించి మాట్లాడినప్పుడు నా ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు అంటూ కౌంటర్లు ఇస్తుంది కూడా. ఇక ఇటీవల ఎన్నికలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాగా వైరల్ అయ్యాడు.

పవన్ ఎక్కడికి వెళ్లినా తోడుగా తన కొడుకు అకిరాను తీసుకెళ్లడంతో అకిరా మీద అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానల్ అఖీరాకు భారీ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి, షాక్ లో రేణు దేశాయ్ అని థంబ్ లైన్ పెట్టి వీడియోను అప్లోడ్ చేశారు. ఇక ఈ వీడియో లోపల విషయం ఏముందో కానీ ఈ మెయిల్ లైన్ తో ఆ వీడియో వైరల్ కావడంతో రేణు దేశాయ్ స్పందించింది. అవన్నీ అబద్ధాలు. యూట్యూబ్లో వచ్చేవి అసలు నమ్మవద్దు అని రిప్లై ఇచ్చింది రేణు దేశాయ్. దీన్ని స్క్రీన్ షాట్ తీసి రేణు తన instagram స్టోరీలో పోస్ట్ చేసి కి యూట్యూబ్ వాళ్లు సినిమా స్క్రిప్ట్ రాస్తే మంచిదేమో అని కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: