రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన కల్కి 2898 ఏడి అనే సినిమా జూన్ 27 వ తేదీన విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ చాలా దగ్గర పడడం తో మేకర్స్ కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క ట్రైలర్ ను విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆధ్యంతం ఆకట్టుకునే విధంగా ఉండడం , అలాగే ఇందులో భారీ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉండడంతో ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది.

3 నిమిషాల కంటే ఎక్కువ నిడివి కలిగి ఉన్నా కూడా ఈ ట్రైలర్ ఎక్కడ బోర్ కొట్టకుండా ముందుకు సాగడంతో ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల అయ్యి 24 గంటల సమయం ముగిసింది. 24 గంటల సమయంలో ఈ సినిమా తెలుగు వర్షన్ ట్రైలర్ కు ఎన్ని వ్యూస్ , ఎన్ని లైక్స్ వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.  

కల్కి సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటలు పూర్తి అయ్యే సరికి 14.43 మిలియన్ వ్యూస్ ను , 694 కే లైక్స్ ను తెచ్చుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా ట్రైలర్ కు అదిరిపోయే రేంజ్ వ్యూస్ , లైక్స్ దక్కినప్పటికీ , ఈ సినిమా ట్రైలర్ చాలా కొత్త రికార్డులను నెలకొల్పడంలో మాత్రం వెనకబడిపోయింది. ఇకపోతే ఈ సినిమాకు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అయినటువంటి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా , దీపిక పదుకొనె , దిశ పటానీ , అమితా బచ్చన్ ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. కమల్ హాసన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: