టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో తన ఖాతాలో హిట్ వేసుకుని చాలా కాలం అవుతుంది. ఓ మంచి చిత్రంతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు వరుణ్. కొన్నాలుగా తనకు అచ్చొచ్చిన లవ్ స్టోరీస్ కాకుండా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్నాడు వరుణ్ సందేశ్. ఇక ఈ లిస్టులో వరుణ్ చేసిన తాజా చిత్రం నింద. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీకి రాజేష్ దర్శకత్వం వహించాడు.

జూన్ 21న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కి రాబోతుంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ తో యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇక వరుణ్ నిందా మూవీ టీజర్ ను యాక్షన్ హీరోలు విశ్వక్సేన్ మరియు సందీప్ కిషన్ కలిసి రిలీజ్ చేశారు. " మంచోడికి న్యాయం జరుగుతుందని నమ్మకం పోయినా రోజు.. ఒక సమాజం చనిపోయినట్టు " అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది.

కొందరిని కిడ్నాప్ చేసి ఓ రూమ్లో బంధించడం వారికి అవసరమైన ఫుడ్ అండ్ మెడిసిన్స్ ఓ అమ్మాయి తీసుకువచ్చి ఇవ్వడం ఇందులో మెయిన్ హైలెట్గా నిలిచింది. " మంచోడి కోసం ఒక వినాశనానికి ఆరంభం .. అబద్దాన్ని బలంగా చెప్పినంత మాత్రాన నిజం అయిపోదు.. బలవంతుడిదే రాజ్యం అని అనుకోవడానికి మనమేమి అడవుల్లో బ్రతకడం లేము.. అంటూ సాగిన డైలాగ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. ప్రజెంట్ ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. ఇక ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై మరిన్ని హైప్స్ నెలకున్నాయి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సాధారణంగా మంచి కంటెంట్ ఉన్న సినిమాస్ని మాత్రమే నిర్మిస్తూ ఉంటుంది. అటువంటిది ఈ సినిమాని కూడా నిర్మించడంతో ఈ మూవీలో మంచి కంటెంట్ ఉండి ఉంటుంది అన్న భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: