టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ లో ఒకరైన అనుష్క శెట్టి మనందరికీ సుపరిచితమే. లేడీ సూపర్ స్టార్ కా పేరు సంపాదించుకుంది మీ ముద్దుగుమ్మ. ఇతరులు సమస్యల్లో ఉంటే క్షణం ఆలోచించకుండా డబ్బులు ఇచ్చే మంచి మనిషి అనుష్క శెట్టి. అయితే తాజాగా ఆమెకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కార్తీకి జోడీగా అలెక్స్ పాండ్యన్ మూవీలో నటించిన ఈమె డూప్ అందుబాటులో లేకపోవడంతో రియల్ స్టంట్ చేసిందట.

అనార్కలి డ్రెస్ లో మూవింగ్ ట్రైన్ ఎక్కినట్లు ఓ ఈవెంట్లో చెప్పాడు కార్తి. ఆమెకు అంత గొప్ప కమిట్మెంట్ ఉందని పొగడాడు. ఇంతకీ ఆమె ఎందుకలా చేసిందంటే ఆరోజు డూప్ లేక షూటింగ్ ఆగిపోతే నిర్మాత నష్టపోతాడని అలా చేసిందని తెలిపాడు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు అనుష్క శెట్టిని పొగడడం మొదలుపెట్టారు. కాగా రీసెంట్గా మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ అట్టి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది స్వీటీ. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత స్వీటీ నటించిన మొట్టమొదటి సినిమా ఇది. ఇక ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో తన తదుపరిచిత్రం పై మంచి హైప్స్ ఏర్పడ్డాయి.

ప్రస్తుతానికి అనుష్క శెట్టి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా మాత్రమే చేస్తుంది. తెలుగు హీరోలతో ఎటువంటి సినిమా కూడా కమిట్ అవ్వలేదు. ఈ బ్యూటీ మునిపటి లాగా వరుస సినిమాలతో బిజీ అవ్వాలని తన ఫాన్స్ కోరుకుంటున్నారు. మరి వారి ఫ్యాన్స్ కోరిక ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. ఇదిలా ఉంటే గత కొంతకాలం నుంచి అనుష్క శెట్టి పెళ్లి పై అనేక రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కి అనుష్క శెట్టి కి పెళ్లి అంటూ గతంలో అనేక పుకార్లు వచ్చాయి. కానీ వీరిద్దరి మధ్య ఏమీ లేదని ఇద్దరూ స్పందించినప్పటికీ ఈ వార్తలకి అడ్డు కట్ట పడలేదు. ఇక ప్రజెంట్ కూడా ఈ వార్తలే సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: