తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటుడు అయినటువంటి అజయ్ ఘోష్ తాజాగా మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కలర్ ఫోటో సినిమాతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న చాందినీ చౌదరి ఓ కీలక పాత్రలో నటించింది. శివ పాలడుగు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని ఫ్లై హై సినిమాస్‌పై హర్ష గారపాటి , రంగారావు గారపాటి నిర్మించారు.

ఇకపోతే ఈ సినిమాని జూన్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారి ప్రకటనను చాలా రోజుల క్రితమే మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ , వేదిక ను ఖరారు చేస్తూ తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు అనగా జూన్ 12 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియా లో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే అజయ్ ఘోష్ , చాందిని చౌదరి ఇద్దరికీ కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. మరి ఈ సినిమాతో వీరికి ఎలాంటి గుర్తింపు లభిస్తుందో , ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను తెచ్చుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

ag