తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో సుదీర్ బాబు ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరియర్ లో చాలా సినిమాలలో హీరోగా నటించాడు. కానీ అందులో కొన్ని మూవీ లతో మాత్రమే ఈయన మంచి విజయాలను అందుకున్నాడు. హిట్ ఫ్లాప్ లతో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ నటుడు ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు హరోం హార అనే సినిమాలో హీరో గా నటించాడు. జ్ఞానసాగర్ ద్వారకమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఈ నెల 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. అలాగే రన్ టైమ్ ను కూడా లాక్ చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది.

మూవీ 2 గంటల 34 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సునీల్ , జయ ప్రకాష్ , అక్షర , అర్జున్ గౌడ , లక్కీ లక్ష్మణ్ , రవి కాలే కీలక పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sb