మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో 75 వ మూవీ గా రూపొందబోయే సినిమా నిన్న పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబో లో ధమాకా అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొంది అద్భుతమైన విజయం సాధించింది.

ఈ సినిమాలో వీరిద్దరి జంటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. దానితో ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా కన్ఫామ్ అయ్యింది అనగానే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇకపోతే ఈ సినిమాకు భాను భోగావరపు దర్శకత్వం వహించనుండగా , బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. విధు అయ్యన ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వ్యవహరించనుండగా , నవీన్ నోలి ఈ మూవీ కి ఎడిటర్ గా పని చేయనున్నాడు. సీతారా ఎంటర్టైన్మెంట్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

ఇకపోతే ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో భాగ్య శ్రీ హీరోయిన్ నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ హిందీ సినిమా అయినటువంటి రైడ్ కి రీమేక్ గా రూపొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలోనే రవితేజ , హరీష్ శంకర్ కాంబో లో షాక్ , మిరపకాయ్ రెండు మూవీ లు రూపొందాయి. ఇది వీరి ఇద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా. మరి ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: