షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని సినీ ఇండస్త్రీలో అడుగుపెట్టిన నటీనటులలో టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరి, యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.సినిమాల్లోకి రాకముందు వీరిద్దరూ కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. యూట్యూబ్ లో వచ్చిన 'ట్రూ లవ్', 'ది బ్లైండ్ డేట్', 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్', 'అప్రోచ్', 'ప్రపోజల్', 'సాంబార్ ఇడ్లీ' లాంటి షార్ట్ ఫిలిమ్స్ వీరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే స్మాల్ స్క్రీన్ ను పంచుకున్న ఈ జంట, బిగ్ స్క్రీన్ మీద ఇంతవరకూ కలిసి నటించలేదు. ఇదే విషయంపై లేటెస్టుగా చాందిని ఓ ఇంటర్వ్యూలో స్పదించింది. రాజ్ తరుణ్ తో కలిసి సినిమాలు చేయకపోవడానికి గల కారణాలను తెలిపింది.రాజ్ తరుణ్ తో కలిసి నటించడానికి ఆఫర్స్ రాలేదు. కొన్ని సినిమాల్లో రాజ్ తరుణ్ కు జోడీగా ఛాన్స్ లు వచ్చాయి. కానీ అనుకొని కారణాల వల్ల ఆ సినిమాలు చేయలేదు. రాజ్ తరుణ్ నటించిన మొదటి మూడు సినిమాలు హీరోయిన్ గా నన్నే సంప్రదించారు. కానీ అనుకోకుండా అవి చేయడం కుదరలేదు. అంతకు మించి ఏ కారణం లేదు. ఇప్పటికి మేమిద్దరం టచ్ లోనే ఉంటాం.. అని చెప్పుకొచ్చారు చాందిని చౌదరి. ప్రస్తుతం చాందిని చౌదరి యేవమ్‌ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. అలాగే మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాలోనూ నటిస్తుంది. ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

కేటుగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించిది ఈ బ్యూటీ. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాల్లో కనిపించింది ఈ బ్యూటీ ఆతర్వాత హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. కాగా సుహాస్ తో కలిసి కలర్ ఫోటో అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో చాందిని చౌదరి ఒకరు. హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తూ రాణిస్తుంది ఈ చిన్నది. సినిమాల్లోకి రాక ముందు చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది చాందిని. కేటుగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించిది ఈ బ్యూటీ. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాల్లో కనిపించింది ఈ బ్యూటీ ఆతర్వాత హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. కాగా సుహాస్ తో కలిసి కలర్ ఫోటో అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఏకంగా ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. రీసెంట్ గా గామి అనే సినిమాతో హిట్ అందుకుంది ఈ బ్యూటీ. అయితే చాందిని తోపాటు షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారిలో రాజ్ తరుణ్ కూడా ఒకరు.

మరింత సమాచారం తెలుసుకోండి: