టాలీవుడ్ టాలెంట్ నటుడు సుధీర్ బాబు తాజాగా హరోం హర అనే సినిమాలో హీరో గా నటించాడు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా లో మాళవిక శర్మ కథానాయికగా నటించడం జరిగింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సునీల్ , జయ ప్రకాష్ , అక్షర , అర్జున్ గౌడ , లక్కీ లక్ష్మణ్ మరియు రవి కాలే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ సంస్థ వారు ఈ సినిమాలు నిర్మించారు.

మూవీ ని జూన్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న రాత్రి ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ , అడవి శేషు , విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇకపోతే ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సుదీర్ బాబు మాట్లాడుతూ ... హరోం హర సినిమా పై నాకెంతో నమ్మకం ఉంది. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం అందుకుంటుంది. తెలుగు లో ఇప్పటి వరకు రాని ఒక కొత్త రకం కాన్సెప్ట్ తో ఈ మూవీ ని రూపొందించాం.

ఈ రోజు కృష్ణ గారు ఉంటే బాగుండేది. ఆయన హరోం హర లాంటి సినిమాలో నన్ను చూడాలి అని ఆశపడ్డారు. చైతన్ భరద్వాజ్మూవీ కి అందించిన సంగీతం మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ సినిమాలో మాళవిక శర్మ బాగా నటించింది అని సుధీర్ బాబు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా చెప్పుకొచ్చాడు. మరి ఈ మూవీ తో ఈ నటుడి కి ఏ స్థాయి విజయం దక్కుతుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

sb