రామ్ పోతినేని హీరో గా నీది అగర్వాల్ , నబా నటేష్ హీరోయిన్లుగా , డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కొంత కాలం క్రితం ఈస్మార్ట్ శంకర్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కంటే ముందు రామ్ ,  నిధి అగర్వాల్ , నబా నతేష్ , పూరి జగన్నాథ్ వీరంతా కూడా వరుస ఫ్లాప్ లలోనే ఉన్నారు.

సినిమా విజయంతో వీరందరికీ కూడా అద్భుతమైన గుర్తింపు లభించింది. అలా ఈ మూవీ చాలా మంది కి మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా డబల్ ఈస్మార్ట్ అనే మూవీ ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ పోతినేని హీరో గా నటిస్తూ ఉండగా కావ్య దాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

మూవీ కి సంబంధించిన కేవలం మూడు పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు , ఇవి పూర్తి అయితే ఈ సినిమా మొత్తం షూటింగ్ పూర్తి అయినట్లే అని తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన రెండు పాటల చిత్రీకరణను హైదరాబాదు లోనూ , ఒక పాట చిత్రీకరణను గోవా లోనూ షూట్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ షూటింగ్ పూర్తి అయ్యాక ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఫుల్ స్పీడ్ గా కంప్లీట్ చేసి ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: