లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా మనిషా కొయిరాల హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం ఇండియన్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. తమిళ్ లో ఇండియన్ అనే టైటిల్ తో విడుదల అయిన ఈ సినిమా తెలుగులో భారతీయుడు అనే టైటిల్ తో విడుదల అయింది. ఈ సినిమా అటు తమిళ్ , ఇటు తెలుగు ఇండస్ట్రీ లలో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా ఇండియన్ 2 అనే సినిమాను శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరో గా నటిస్తూ ఉండగా , కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ , సిద్ధార్థ్మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీ ని లైకా ప్రొడక్షన్ సంస్థ వారు నిర్మించారు. ఈ మూవీ ని జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

భారతీయుడు సినిమాలో హీరోయిన్గా నటించిన మనిషా కొయిరాలా ఇండియన్ 2 మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది అని ఈమె పాత్ర ఈ సినిమాలో హైలైట్ గా ఉండనుంది అని ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా భారతీయుడు మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ లో మనిషా కొయిరాల పాత్ర ఉన్న పెద్దగా ఆశ్చర్యం లేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమాలో నిజం గానే మనిషా కొయిరాలా ఉందా ..? లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: