షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ను మొదలు పెట్టి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న ముద్దుగుమ్మలలో చాందిని చౌదరి ఒకరు. ఈమె షార్ట్ ఫిలిమ్స్ నుండి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంత కాలం పాటు అవకాశాల కోసం చాలా కష్టపడవలసి వచ్చింది. అలాంటి సమయం లోనే ఈమె సుహాస్ హీరోగా రూపొందిన కలర్ ఫోటో సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ లో విడుదల అయినప్పటికీ ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు రావడం , ఈ మూవీ అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా తర్వాత నుండి చాందినీ కి తెలుగు లో వరుస అవకాశాలు దక్కుతున్నాయి.

అందులో భాగంగా ఇప్పటికే ఈమె అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ బ్యూటీ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. తాజాగా ఈమె యేవమ్ , మ్యూజిక్ షాప్ మూర్తి అనే రెండు సినిమాలలో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా జూన్ 14 వ తేదీన విడుదల కానున్నాయి. దానితో ప్రస్తుతం ఈ బ్యూటీ ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతుంది.

ఇప్పటివరకు ఈ సినిమాలకు సంబంధించిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ మూవీలపై పరవాలేదు అనే స్థాయిలో జనాల్లో అంచనాలు ఉన్నాయి. మరి ఈ రెండు మూవీ లు కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈమె క్రేజ్ తెలుగులో మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ఈ సినిమాలతో ఈ బ్యూటీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. చాందిని ప్రధాన పాత్రలో నటించిన యేవమ్ మూవీ కి ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహించగా , నటుడు నవదీప్ మూవీ ని నిర్మించాడు. చాందిని కీలక పాత్రలో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకి శివ పాలడుగు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

cc