పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితమే ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ల హడావిడి మొదలు కావడంతో పవన్ ఈ సినిమా షూటింగ్ ను పక్కన పెట్టి ఎలక్షన్ లపై ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా మే 13 వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ లు జరిగాయి. 

వాటికి సంబంధించిన ఫలితాలు జూన్ 4 వ తేదీన విడుదల అయ్యాయి. ఈ ఫలితాలలో పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ అయినటువంటి జనసేన.కు అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఈ పార్టీ 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తే అన్నింటిలోనూ గెలిచి 100% రిజల్ట్ ను నమోదు చేసింది. ఇకపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ యూనిట్ ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేసింది.

పోస్టర్ పై సనాతన ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అని రాసుకోచ్చారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఒక చేతిలో సుట్టే పట్టుకొని , మరో చేతితో తన తల వెంట్రుకలను పైకి అంటూ స్టైలిష్ లోకి ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే గతంలో పవన్ , హరీష్ కాంబో లో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: