ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలకు హిందీ లో మంచి డిమాండ్ ఏర్పడింది. దానితో సౌత్ సినీ పరిశ్రమకు సంబంధించిన మూవీ ట్రైలర్స్ విడుదల అయిన కూడా వాటికి మంచి రెస్పాన్స్ హిందీ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు సౌత్ నుండి విడుదల అయిన సినిమా ట్రైలర్ లలో హిందీ వర్షన్ లలో విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 8 ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం.

ప్రభాస్ హీరో గా రూపొందిన సలార్ మూవీ ట్రైలర్ హిందీ వర్షన్ కు 54.32 మిలియన్ వ్యూస్ 24 గంటల్లో లభించాయి. యాష్ హీరోగా రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 49.06 మిలియన్ వ్యూస్ లభించాయి. ప్రభాస్ హీరో గా రూపొందిన సలార్ రిలీజ్ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 31.66 మిలియన్ వ్యూస్ లభించాయి. ప్రభాస్ హీరో గా రూపొందిన సాహో మూవీ హిందీ వర్షన్ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 31.65 మిలియన్ వ్యూస్ లభించాయి.


విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన లైగర్ మూవీ హిందీ వర్షన్ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 30.21 మిలియన్ వ్యూస్ లభించాయి. ప్రభాస్ హీరో గా రూపొందిన రాధే శ్యామ్ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 28.08 మిలియన్ వ్యూస్ లభించాయి. రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ హిందీ వర్షన్ ట్రైలర్ కు విడుదల 24 గంటల్లో 19.7 మిలియన్ వ్యూస్ లభించాయి. ప్రభాస్ హీరో గా రూపొందిన కల్కి 2898 ఏడి మూవీ హిందీ వర్షన్ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 16.95 మిలియన్ వ్యూస్ లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: