సమంత పూర్తి పేరు సమంత రుతు ప్రభు. తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో  తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగు ప్రముఖ కథానాయికగా ఎదిగింది.రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధి గాంచింది. ఏ మాయ చేశావే సినిమాకిగాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు మరియు  ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డ్ వరించాయి. బృందావనం, జబర్‌దస్త్, రామయ్యా వస్తావయ్యా, మనం, రభస, మహానటి, యూ టర్న్ వంటి చిత్రాలలో నటించింది. అక్కినేని నాగార్జున కోడలిగా, నాగచైతన్య భార్యగా కూడ సినిమాలలొ నటించింది.విడాకుల తర్వాత సమంతలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. 2021లో సమంత జీవితం ఒడిదుడుకులకు లోనైంది. భర్త నాగ చైతన్యతో విబేధాలు తలెత్తాయి. దాంతో వేరు కుంపట్లు పెట్టారు.ఇద్దరికీ గొడవలు అంటూ వార్తలు వచ్చాయి. ఈ పుకార్లు మొదలైన కొన్ని నెలలకు అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. ఈ సమయంలో సమంత తీవ్ర ఒత్తిడికి గురైంది. ఆ వేదన నుండి బయటపడేందుకు మిత్రుల సహాయం తీసుకుంది.

వారితో వెకేషన్స్ కి వెళ్ళింది. హిమాలయాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను సమంత సందర్శించింది. అప్పుడే ఆమెకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువైంది. ఇషా ఫౌండేషన్ స్థాపకుడు సద్గురు ప్రవచనాలు ఆమెను ఎంతగానో ఆకర్షించాయి. ఆయనకు భక్తురాలు అయిపోయింది. ప్రతి శివరాత్రికి సమంత తన మిత్రులతో కోయంబత్తూర్ వెళుతుంది. రాత్రి జాగారం చేస్తుంది. కాగా ప్రస్తుతం సమంత కోయంబత్తూర్ సద్గురు ఆశ్రమంలో ఉన్నారు. ఆమె సద్గురు బోధనలు వింటూ, ధ్యానం చేస్తూ మానసిక ప్రశాంతత పొందుతుంది. ఇక సమంతకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. సమంత ప్రస్తుత వయసు 37 ఏళ్ళు. వివాహం చేసుకుంటే ఇప్పుడే చేసుకోవాలి. కానీ ఆమె దిశగా అడుగులు వేయడం లేదు. ఇటీవల సమంత ఓ నిర్మాణ సంస్థను స్థాపించింది. ఈ బ్యానర్ లో ఫస్ట్ మూవీగా మా ఇంటి బంగారం పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రకటించింది. ఈ మూవీలో సమంతనే హీరోయిన్. ఇక సమంత నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. హనీ బన్నీ టైటిల్ తో ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: