మాస్ మహారాజా రవితేజ  గురించి  ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. వరస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక బ్రాండ్ నేమ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అయితే పోయిన ఏడాదిలో ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరొక బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇందులో రవితేజకు జోడిగా శ్రీ లీల నటించింది. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా త్రినాథ రావు  నక్కిన ఈ మూవీని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఏకంగా రూ:100 కోట్ల గ్రాఫ్ కలెక్షన్  భారీ విజయాన్ని

 సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే మరోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా భాను భోగవరపు దర్శకత్వంలో శ్రీ లీల, రవితేజ మరో సినిమా చేయబోతున్నారు. రవితేజ 75 వ సినిమా గా  ఈ సినిమాకు సంబంధించిన మొదటి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఈ మూవీను సితార ఎంటర్టైన్మెంట్స్  బ్యానర్ పై ఎక్కీయగా నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అంతేకాకుండా ఈ ఏడాది చివర్లో ఈ మూవీను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే

 ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమా కూడా ధమాకా లాగే బ్లాక్ బస్టర్ హిట్ విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. ఇది కాసేపు పక్కన పెడితే రవితేజ నటించే సినిమాల విషయానికి వస్తే..... ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన మిస్టర్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ సినిమాకు రీమేక్ గా వస్తుంది. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ జోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం నీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: