చాలా మంది నటులు తమ కెరియర్ లో ఒక్క సారైనా తాము అభిమానించే నటితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకునే వారిలో కొంత మంది కి మాత్రమే ఆ కోరిక నెరవేరుతాయి. కొంత మంది.కి నెరవేరదు. ఇకపోతే టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ కు మాత్రం తన అభిమాని నటితో నటించే అవకాశం రెండు సార్లు దక్కింది. ఇంతకు విజయ్ దేవరకొండ అభిమాని నటి ఎవరు ..? ఆమెతో ఆయన ఏ సినిమాలలో నటించాడు అనే వివరాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్న విజయ్ దేవరకొండ కు సమంత అభిమాన నటి అంట. ఆయన కెరియర్ ను మొదలు పెట్టిన సమయం నుండి సమంత తో ఒక్క సినిమా అయినా నటించాలి అని ఆయనకు కోరిక ఉండేదట. ఇకపోతే ఆ కోరిక ఆయన కెరియర్ ప్రారంభం లోనే నెరవేరింది. నాగ్ అశ్విన్ , కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మహానటి అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో విజయ్ , సమంత తో కలిసి నటించాడు. కాకపోతే ఈ సినిమాలో వీరివి కీలక పాత్రలు మాత్రమే. కాకపోతే తన అభిమాన నటితో కలిసి నటించినందుకు విజయ్ ఈ సినిమాతోనే చాలా ఆనందపడ్డాడట. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరో గా సమంత హీరోయిన్ గా ఖుషి అనే మూవీ రూపొందింది. ఈ సినిమాతో ఆయన మరింత ఆనందపడ్డాడట. ఎందుకు అంటే తన అభిమాన నటితో సినిమా మొత్తం నటించే అవకాశం వచ్చినందుకు ఆయన ఎంతో ఆనందపడ్డాడట. అలా విజయ్ దేవరకొండ తన అభిమాని నటి అయినటువంటి సమంత తో రెండు సార్లు నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd