టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి గోపీచంద్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వం అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఓ చిన్న వీడియోని విడుదల చేయగా అది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ వీడియో ద్వారా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. 

ఈ రోజు గోపీచంద్ పుట్టిన రోజు అన్న విషయం మనకు తెలిసిందే. దానితో ఈయన పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో గోపీచంద్ బైక్ పై కూర్చుని స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మని అయినటువంటి కావ్య తాప‌ర్ హీరోయిన్ గా నటిస్తోంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ పై ప్రముఖ నిర్మాత టి జి విశ్వ‌ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే గోపీ చంద్ , శ్రీను వైట్ల తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం వీరు వరస అపజాయలను ఎదుర్కొంటున్నారు. దానితో విరి క్రేజ్ కూడా చాలా వరకు తగ్గింది. దానితో ఈ సినిమాతో ఎలాగైనా అదిరిపోయే సూపర్ సాలిడ్ హిట్ కొట్టి మళ్ళీ అదిరిపోయే రేంజ్ ఫామ్ లోకి రావాలి అని వీరిద్దరూ కూడా కసితో పని చేస్తున్నారు. మరి విశ్వం మూవీ తో వీరిద్దరు మళ్ళీ తిరిగి ఫుల్ ఫామ్ లోకి వస్తారో .. లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc