నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈ మధ్య కాలం లో బాలకృష్ణ వరుస విజయాలను అందుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే . దానితో ఈయన క్రేజ్ కూడా అమంతం పెరిగిపోయింది. క్రేజ్ పెరగడంతో బాలకృష్ణ రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది . బాలకృష్ణ అఖండ సినిమా కంటే ముందు వరుసగా ఆపజాయలను ఎదుర్కొన్నాడు . దానితో ఆయన గ్రాఫ్ కూడా చాలా వరకు పడిపోయింది .

అలాంటి సమయం లోనే ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు . ఈ మూవీ అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో బాలయ్య క్రేజ్ మళ్లీ అమాంతం పెరిగి పోయింది. ఇకపోతే అఖండ సినిమా కోసం బాలయ్య 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది . ఇక అఖండ మూవీ సూపర్ సాలిడ్ విజయం సాధించడంతో బాలయ్య క్రేజ్ సూపర్ గా పెరిగింది. ఆ ఊపులోనే వీర సింహా రెడ్డి అనే సినిమాలో బాలయ్య హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయం అందుకుంది.

దానితో బాలయ్య క్రేజ్ మరింతగా పెరిగింది. ఇకపోతే కొంత కాలం క్రితమే బాలకృష్ణ భగవంత్ కేసరి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఇక భగవంత్ కేసరి మూవీ కి బాలకృష్ణ ఏకంగా 18 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అఖండ మూవీ కి 10 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకోగా ఇప్పుడు భగవంత్ కేసరి మూవీ కి 18 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: