లోక నాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో తమిళ , తెలుగు సినిమాలలో నటించి రెండు ఇండస్ట్రీలలో కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు . కమల్ హాసన్ తన కెరియర్లో ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా హిట్ ,  ఫ్లాప్ లతో కూడా ఏ మాత్రం సంబంధం లేకుండా ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలలో , వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూనే వచ్చాడు. ఎన్నో గొప్ప గొప్ప పాత్రలలో నటించిన కమల్ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

కమల్ హాసన్ వైవిధ్యమైన పాత్రలలో , డిఫరెంట్ గెటప్ లలో నటించడానికి ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. తాజాగా కమల్ హాసన్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి అనే సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

అందులో కమల్ హాసన్ కు సంబంధించిన ఒక షాట్ ను కూడా జోడించారు. ఇందులో కమల్ హాసన్ వేషదరణ పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. చాలా ముసలి వాడి గెటప్ లో ముడతలు పడిపోయిన మొహంతో ఈ సినిమా ట్రైలర్ లో కమల్ కనిపించాడు. ఇక ఈ పాత్రలో కమల్ చాలా వయసు ఉన్న ముసలి వ్యక్తిగా కనిపించడం కోసం ఈయనకు ఏకంగా 3 గంటల పాటు మేకప్ వెయ్యాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇలా కల్కి మూవీ లోని పాత్ర కోసం కమల్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: